ఫేస్ బుక్.. ఈ పేరు తెలియనివారుండరు. ఈ సంస్థ అత్యంత శక్తివంతమైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరైన షెరైల్ శాండ్ బర్గ్ షాకింగ్ అనౌన్స్ మెంట్ చేశారు. 14ఏళ్ల పదవీకాలం తర్వాత ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవికి గుడ్ బై చెప్పేయనున్నారు. 52ఏళ్ల శాండ్‌బర్గ్ పదవికి తీవ్రమైన పోటీ రావడంతో ఆమె పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే మెటా సంస్థకు సంబంధించిన బోర్డులో సభ్యురాలిగా కొనసాగుతానని చెప్పారు. “ఆమె నాకు చాలా నేర్పింది. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా నా జీవితంలో చాలా ముఖ్యమైన క్షణాల్లో తోడుగా ఉంది. షెరిల్‌తో కలిసి ఈ కంపెనీని నడపడం మిస్ అవుతున్నా” అని ఫేస్ బుక్ CEO మార్క్ జూకర్బర్గ్ ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు. ఆన్లైన్ సోషల్ నెట్వర్క్ మెటావర్స్ రూపంలో ఇంటర్నెట్ కోసం చూసే వర్చువల్ విజన్ వైపు చూడటానికి రీబ్రాండ్ చేయడంతో శాండ్‌బర్గ్ రిటైర్మెంట్ వార్తలు బయటికొచ్చాయి.