దివంగత ఎన్టీ రామారావు చిన్న కుమార్తె (నాలుగు) కంఠమనేని ఉమామహేశ్వరి మరణం వెనుక ఏం జరిగి ఉంటుంది? అనారోగ్య సమస్యకు ఆత్మ హత్య చేసుకునేంత సున్నిత మనస్కురాలా? ఉమామహేశ్వరి మృతికి కారణం అనారోగ్య సమస్యలేనని తెలుస్తోంది. ఉమామహేశ్వరి గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించినట్టు సమాచారం. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మానసిక సమస్యలు, ఒత్తిడి కారణంగా ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యలు సమాచారం బట్టి తెలుస్తోంది. నలుగురు కూతుళ్లు ఎన్టీఆర్ నలుగురు కుమార్తెల్లో ఉమా మహేశ్వరి నాలుగవ కుమార్తె అనే సంగతి తెలిసిందే.పెద్ద కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి కాగా, రెండవ కుమార్తె చంద్రబాబు భార్య భువనేశ్వరి, మూడవ కుమార్తె లోకేశ్వరి. ఇటీవలే ఉమామహేశ్వరి కుమార్తె వివాహం కూడా జరిగింది. పెద్ద కూతురు అమెరికాలో ఉంటున్నారు. రెండో కూతురు ఇక్కడే ఉంటున్నారు. బాల కృష్ణ, ఇతర ఎన్టీ ఆర్ కుటుంబ సభ్యులు, చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాలు ఉమా మహేశ్వరి ఇంటికి చేరుకొని విషాదంలో ఉన్నారు.