అక్టోబర్ నెలలో చివరిరోజైన సోమవారం డాలరు మారకంలో రూపాయి 30 పైసలు నష్టపోయి 82.77వద్ద ముగిసింది. దీంతో అక్టోబర్ నెల మొత్తంలో 1.77 శాతం విలువను రూపాయి కోల్పోయినట్లయ్యింది. అలాగే వరుసగా 10 నెలల పాటు నష్టాల్ని చవిచూసి రికార్డు సృష్టించింది. ఇంతకుముందు 2021 డిసెంబర్లో మాత్రమే రూపాయి లాభంతో ముగిసింది. 1985 తర్వాత రూపాయి ఇన్ని నెలల పాటు తగ్గడం ఇదే ప్రధమం.