నైలు నది ఈశాన్య ఆఫ్రికాలో ఒక పెద్ద నది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది. దీని పొడవు 6,853 Km ( 4,259 miles ). ఇదొక అంతర్జాతీయ నది. 11 దేశాలు ఈ నదిని వినియోగించుకుంటున్నాయి. అవి.. టాంజానియా, యుగాండా, బురుండి, రవాండా, కాంగో, కెన్యా, ఇథియోపియా, ఎరిత్రియా, ఈజిప్ట్, సుడాన్ ఇంకా సౌత్ సుడాన్ . ఈ నది నీటిని సక్రమంగా వినియోగించుకుంటే ఇంకా అదనంగా 5 కోట్ల మంది ప్రజలకు సరిపడే ఆహారాన్ని పండించుకోవచ్చట.