Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home ఆధ్యాత్మికం

సామీ… ఇంకా పనులున్నాయ్..

V Srinivas by V Srinivas
May 7, 2022
in ఆధ్యాత్మికం

ఆసక్తికరమైన ఈ ఘటన చదవండి…

ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు.. ఎదురుగా వున్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు. సాధువుకి మంచి భోజనం పెట్టి, చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే వుండమని కోరాడు ఆ ఇంటి యజమాని. మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ, యజమాని, “ఏమిటో నండీ.. సంసారంలో సుఖం లేదండీ. మీ జీవితమే హాయి.. అన్నాడు..

వెంటనే ఆ సాధువు “అయితే నా వెంట రా.. నీకు మోక్ష మార్గం చూపిస్తాను” అన్నాడు.

యజమాని కంగారు పడుతూ… “అలా ఎలా కుదురుతుంది.. పిల్లలు చిన్నవాళ్ళు.. వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా..” అన్నాడు.

సాధువు మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి.. ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూ‌సి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి, అతిథి మర్యాదలు చేశాడు.

మాటలలో సాధువు అన్నాడు.. పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కదా నా వెంట రా.. నీకు మోక్ష మార్గం చూపిస్తాను “యజమాని తడబడుతూ ఇప్పుడే కాదు స్వామీ.. పిల్లలు స్థిరపడాలి.. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి…” అన్నాడు.

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్లీ అదే.. యజమాని ఆతిథ్యం.. సాధువు అదే మాట.. యజమాని జవాబు కొంచెం విసుగ్గా.. “పిల్లలకి డబ్బు విలువ తెలియదు.. అందుకని నేను దాచినంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను.. వీలు చూసుకుని చెబుతాను. ఒక పెద్ద ఇల్లు కట్టాలి.. మీలాగా నాకు ఎలా కుదురుతుంది ” అన్నాడు..

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్లీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళి పోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి లోనికి ఆహ్వానించాడు. అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు.. సాధువు కి కొంచెం బాధనిపించింది. ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు.. చెట్టు కింద ఒక కుక్క కూర్చుని వుంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు..

సందేహంలేదు, యజమాని కుక్కగా పుట్టాడు.. సాధువు మంత్ర జలం దాని మీద జల్లి ,
“ఏమిటి నీ పిచ్చి మోహం.. కుక్క గా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా.. నా వెంట రా.. నీకు మోక్ష మార్గం చూపిస్తాను” అన్నాడు.. యజమాని “ఆ మాట మాత్రం వినలేను.. ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా” అన్నాడు.

మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు. కుక్క కనపడలేదు పక్కవారిని అడిగితే అది చనిపోయిందని చెప్పారు. అయినా సాధువు అనుమానం తీరక, చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది.. పరీక్షగా చూసాడు ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ పాము గా పుట్టెడు అని తెలుసు కోని.. మంత్ర జలం చల్లి, “ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా.. అన్నాడు…

ఆ ఒక్క మాట మాత్రం అనకండి. నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా..

సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి , అతని కొడుకులతో “మీ నాన్న ఆ చెట్టు కిందనె ధనం దాచిపెట్టాడు. కానీ జాగ్రత్త! అక్కడ పాము ఉంది” అనగానే కొడుకులు ఎగిరి గంతేసి..

కర్రలు తీసుకుని బయలుదేరారు. తన కొడుకులే తనను కర్రలతో చావ గొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది..

గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు కాని మోహబంధాలు ఎంత  వరకూ మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం.

ఇహమే కాదు పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించుకోవాలి…

ShareSendShareTweet
Previous Post

Kareena Kapoor: క‌రీనా యోగా అందాలు అద‌ర‌హో.:

Next Post

‘తాజ్’మహల్.. శివాలయమా?

Related Posts

అన్నవరం దేవస్థానం ఆన్‌లైన్ సేవలు
ఆధ్యాత్మికం

అన్నవరం దేవస్థానం ఆన్‌లైన్ సేవలు

April 18, 2023
తిరుమలలో అంగరంగ వైభంగా వసంతోత్సవాలు
ఆధ్యాత్మికం

తిరుమలలో అంగరంగ వైభంగా వసంతోత్సవాలు

April 4, 2023
సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలు
ఆధ్యాత్మికం

సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలు

March 30, 2023
Next Post
‘తాజ్’మహల్.. శివాలయమా?

'తాజ్'మహల్.. శివాలయమా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

No Content Available
Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved