మనకు ఉన్నట్టే దేవుళ్లకూ ఆధార్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఓ వ్యక్తి ఏకంగా విఘ్నేశ్వరుడికి ఆధార్ సృష్టించాడు. గణేష్ చతుర్డుని పురస్కరించుకుని వినూత్నంగా కార్డు రూపంలో మండపాన్ని రూపొందించాడు.
దీనిని జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన సరవ్కుమార్ ఏర్పాటుచేశాడు. ఆధార్‌కార్డులో గణేశుడి పుట్టిన రోజు, అడ్రస్ వివరాలు కూడా నమోదు చేశాడు. పేరు: శ్రీగణేశ్, తండ్రి: మహదేవ్, పుట్టిన తేదీ: 01-01-600 సీఈ, చిరునామా: కైలాస పర్వతం, టాప్ ఫ్లోర్, మానస సరోవరం సరస్సు దగ్గర, పిన్‌కోడ్: 000001గా పేర్కొన్నారు. ఈ మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. నెట్టింట్లో జోరుగా షేర్ అవుతున్నది