ఇసుక తవ్వకాల ఖర్చు మాత్రమే తీసుకోవాలి.. చంద్రబాబు మార్గదర్శకాలు

ఇసుక రీచ్‌లలో వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన తవ్వకాల ఖర్చు మాత్రమే తీసుకోవాలని, దానికి అదనంగా ఎటువంటి వసూళ్లు ఉండకూడదని సీఎం చంద్రబాబు మార్గదర్శకం చేశారు. ఇసుక తవ్వకాలు, రవాణాపై గనుల శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇసుక తవ్వకాలు, రవాణాను అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇసుక దొరకడం లేదన్న మాట ఎవరి నోటా వినిపించకూడదని సీఎం స్పష్టం చేశారు. రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లిన ప్రతి వినియోగదారుడితో మాట్లాడి వారి అభిప్రాయాలను … Read more

minister narayana: అమరావతికి రైల్వే లైన్ .. రైతులు, ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ భేటీ

అమరావతి రైల్వే లైన్ వెళ్లే పలు గ్రామాల రైతులు, స్థానిక ఎమ్మెల్యేలతో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ భేటీ అయ్యారు. రైల్వే లైన్ కోసం భూసేకరణ కింద కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకోవాలని మంత్రిని రైతులు ఈ సందర్భంగా కోరినట్లు తెలుస్తోంది. రాజధానిని ఆనుకుని ఉన్న గ్రామాలు కావడంతో తమకూ పూలింగ్ అవకాశం ఇవ్వాలని రైతులు కోరారు. అయితే, సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వారికి తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా … Read more

ఆంధ్రాలోనూ ‘హైటెక్ సిటీ’

 ఆంధ్రుల రాజధాని అమరావతిలోనూ హైటెక్ సిటీ రానుందా ? ఏపీ యూత్ కలలు నెరవేర్చిడానికి సీఎం చంద్రబాబు రూపకల్పన చేస్తున్నారు . 2029 నాటికి 5లక్షల వర్క్​స్టేషన్లు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు . హైదరాబాద్​లోని హైటెక్ సిటీ తరహాలోనే ఏపీ కేపిటల్ అమరావతిలో ‘డీప్ టెక్నాలజీ’ ఐకానిక్ భవనం నిర్మించాలని సీఎం చంద్రబాబు సంకల్పం చేసారు . దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు . నేటి … Read more

సామ్యవాద, లౌకిక పదాలపై సుప్రీంకోర్టు తీర్పు హర్షనీయం: కుమారస్వామి

* 42వ రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ లౌకిక సామ్యవాద సమగ్రత పదాలను చేర్చడంపై అభ్యంతరం చేయడం అర్థరహితమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లా కుమారస్వామి పేర్కొన్నారు.” రాజ్యాంగంలో సమానత్వ భావన అంతర్లీనంగా ఉంది. ప్రవేశికను సవరణ చేసే అధికారం పార్లమెంటుకు ఉంది” అని సుప్రీంకోర్టు చెప్పడం హర్షణీయమని ఆయన చెప్పారు. సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించడం సమానత్వం అనే అంశాన్ని ఇది ప్రతిబింబిస్తుందని, లౌకిక స్వభావం … Read more

Swaroopanandendra Saraswati: సెక్యూరిటీని వెనక్కి తీసుకోండి.. రిషికేశ్ లో తపస్సు చేసుకుంటా.. : స్వరూపానందేంద్ర స్వామి

విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి కీలక ప్రకటన చేశారు. ఇకపై తాను రిషికేశ్ లో తపస్సులో ఎక్కువ సమయం గడుపుతానని చెప్పారు. తనకు ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న ఎక్స్ కేటగిరీ భద్రతను వెనక్కి తీసుకోవాలని కోరారు. తన గన్ మెన్లను వెనక్కి తీసుకోవాలంటూ ఏపీ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్ కు శారదాపీఠం తరపున లేఖ రాశారు. తన భద్రత కోసం 2019 నుంచి 2024 వరకు మునుపటి, ప్రస్తుత ప్రభుత్వాలు పోలీసు రక్షణ కల్పించాయని లేఖలో … Read more

టీడీపీ సభ్యత్వ నమోదులో రికార్డు…

టీడీపీ మరో రికార్డ్ సాధించింది. పార్టీ ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం దేశవ్యాప్తంగా పేరు తెస్తూనే ఉంది పార్టీకి. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది. పార్టీ స్థాపించిన గత 42 ఏళ్లలో అతి తక్కువ సమయంలో అరకోటి సభ్యత్వం పూర్తయింది. గత నెల 26వ తేదీన ప్రారంభమైన సభ్యత్వ నమోదు కేవలం 29 రోజుల వ్యవధిలో 50 … Read more

రామ్ గోపాల్ వర్మ విచారణకు ఎందుకు హాజరుకావడంలేదు ?

పవన్ కళ్యాణ్ , చంద్రబాబు , లోకేష్ లపై సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసు విచారణకు హాజరుకావడంలేదు . పోలీసులను , చట్టాలను లెక్క చేయడంలేదా ? భయంతో విచారణకు డుమ్మా కొడుతున్నారా ?   ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో వర్మపై కేసు నమోదు అయ్యింది. దీంతో విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదటి సారి ఈనెల 19న వర్మ పోలీసుల ఎదుట విచారణకు … Read more

divvela madhuri: అసభ్యంగా పోస్టులు పెడుతున్న వారిపై దివ్వెల మాధురి ఫిర్యాదు

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి కొంతకాలంగా సోషల్ మీడియాలో మారుమోగుతున్నారు. మరో పక్క రెండేళ్ల క్రితం పవన్ కల్యాణ్‌పై దువ్వాడ శ్రీను చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తమపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్న జనసేన నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి … Read more

అదానీ లంచం కేసులో పీకల్లోతులో జగన్… తప్పించుకోలేరు..

151 సీట్లతో బలంగా ఉన్నామని విర్రగేగుతూ . .. రాజకీయంగానూ , ఆర్ధికంగానూ అత్యంత బలంగా ఉన్నామని విర్రవీగుతూ 2019-2014 మధ్య ఐదేళ్ల అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెలరేగిపోయిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదానీ లంచం కేసు నుంచి తప్పించుకునే ఛాన్స్ ఏ కోశానా లేదు. జగన్ సొంత మీడియా సాక్షి ద్వారా తనకే పాపం తెలియదని బుకాయిస్తున్న జగన్ అండ్ కో పెడబొబ్బలు అమెరికా కోర్టులు కనీస పరిగణలోకి తీసుకోవన్న విషయం సాక్షి వారికి … Read more

AP Rain: బంగాళాఖాతంలో వాయుగుండం.. రెండు రోజులు భారీ వర్షాలకు అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి వాయుగుండంగా మారనుందని, దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది శనివారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడి, తుపానుగా మారే అవకాశం ఉందని … Read more