దసరా పండక్కి ఒక్కసారిగా భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 6 గంటలకు నమోదైన రేట్ల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటి కంటే రూ. 10 మేరకు తగ్గింది. ఇక కిలో వెండి కూడా రూ. 100 చొప్పున తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,190గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.77,660గా ఉంది.