యాప్ లన్నిటికీ చెక్ పెట్టే దిశగా టాటా దూసుకొస్తోంది. ఈ డిజిటల్ యుగంలో యాప్ లదే హవా. ప్రజల జీవితాలతో యాప్ లు ఒక భాగంగా మారాయి. ప్రతి రోజు కొన్ని వేల యాప్ లు ముందుకొస్తున్నాయి. మనీ పేమెంట్.. సినిమా.. న్యూస్.. ఆరోగ్యం.. ఫేషన్.. ఇలా ఒక్కో సబ్జెక్ట్ కు చాలా యాప్ లు వస్తున్నాయి. ఇప్పుడు యాప్ ల ప్రపంచంలోకి టాటా కూడా అడుగుపెట్టింది. మారుగున్న టెక్నాలజీకి అనుగుణంగా, ప్రజలకు అవసరాలను గుర్తించి యాప్ ను తయారు చేసింది.
మొబైల్ ఫోన్ ఉంటే చాలు అన్ని మన చెంతకే వస్తాయి. సినిమా టికెట్ల బుకింగ్, ప్రయాణం, నగదు చెల్లింపులు ఇలా ఒక్కో దానికి ఒక్కో యాప్ అందుబాటులో ఉంది. ఇప్పుడు వాటన్నింటినీ ఒకే వేదిక మీదకు తెస్తూ ఒకే యాప్ ను టాటా అందుబాటులోకి తెచ్చింది. అదే ‘టాటా న్యూ’ యాప్. దీనిలో అన్నీ అందుబాటులోకి వచ్చేలా చేసింది ఆ సంస్థ
యూపీఐ పేమెంట్లు చేసేందుకు టాటా పే పేమెంట్స్ సర్వీస్, నిత్యావసరాల కోసం బిగ్ బాస్కెట్, మెడిసిన్స్ కొనుగోలు కోసం 1 ఎంజీ, విమాన టికెట్లు-హోటళ్లలో గదుల బుకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ కోసం టాటా క్లిక్, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుకు క్రోమా, దుస్తులు ఇతర వస్తువుల కొనుగోలు కోసం వెస్ట్ సైడ్ ఇలా అన్నీ ‘టాటా న్యూ’ యాప్‌లో ఉన్నాయి. సర్వీసులు అందించే సరికొత్త సంచలనంగా ఈ యాప్ నిలుస్తోందా? అనేది చూడాలి.