కరోనా తర్వాత ఎంట్రీ లెవెల్ కార్లు, హ్యాచ్‌బ్యాక్ క్యాటగిరీ కార్ల కంటే ఎస్యూవీ కార్లపై పలువురు మోజు పడుతున్నారు. స్ఫోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) పట్ల పెరిగిన గిరాకీని సొమ్ము చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు పోటీ పడుతున్నాయి. అందులో మహీంద్రా అండ్ మహీంద్రా ముందు వరుసలో ఉంది. తాజాగా న్యూ స్కార్పియో క్లాసిక్ మోడల్ కారును ఆవిష్కరించింది. కొన్ని వారాల క్రితమే ఆవిష్కరించిన స్కార్పియో-ఎన్ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఓల్డ్ జనరేషన్ స్కార్పియో అప్డేటెడ్ వర్షన్ కారే స్కార్పియో క్లాసిక్. రెండు వేరియంట్లు క్లాసిక్ ఎస్, క్లాసిక్ ఎస్11ల్లో వస్తున్న స్కార్పియో క్లాసిక్ ధరను మహీంద్రా ఈ నెల 20న ప్రకటించనున్నది.
పాత స్కార్పియో కారుతో పోలిస్తే సెంటర్లో న్యూ మహీంద్రా లోగో, క్రోమ్ స్లాట్స్‌తో రీడిజైన్ చేసిన గ్రిల్లేతో వస్తోంది స్కార్పియో క్లాసిక్. పాత కారు కంటే ఆకర్షణీయంగా బాయ్నెట్, బంపర్ బోల్డర్గా ఉంటాయి. గ్రిల్లెకు పక్కన న్యూ డీఆర్ఎల్స్ అమర్చారు. సిగ్నేచర్ స్కార్పియో టవర్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ కూడా ఉంటాయి. 17 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అమర్చారు.
స్కార్పియో క్లాసిక్‌లో ఇంటీరియర్‌గా క్యాబిన్లో డ్యుయల్ టోన్ థీమ్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఐదు ఎక్స్టీరియర్ కలర్స్ ఆప్షన్లలో స్కార్పియో క్లాసిక్ రూపుదిద్దుకున్నది. రెడ్ రేస్, నాపొలీ బ్లాక్, శాట్ సిల్వర్, పెర్ల్ వైట్, గెలాక్సీ గ్రే రంగుల్లో పొందొచ్చు.
2.2 లీటర్ల జన్-2 ఎంహాక్ సామర్థ్యం గల డీజిల్ ఇంజిన్‌తో మహీంద్రా స్కార్పియో క్లాసిక్ వస్తున్నది. ఇది గరిష్ఠంగా 132 పీఎస్‌ల ఇంధనం, 300 ఎన్ఎం టార్చిని వెలువరిస్తుంది. పాత స్కార్పియోతో పోలిస్తే స్కార్పియో క్లాసిక్ 14 శాతం మెరుగైన మైలేజీ అందిస్తుంది.