చదువు , కుటుంబ నేపథ్యం , వ్యాపార సామ్రాజ్యం లేకపోయినా స్వయం శక్తితో ఎదిగిన ఓ వ్యక్తి స్థాపించిన రామ్ రాజ్ కాటన్ మరింత ముందుకుపోతోంది . . భారతీయ సాంప్రదాయ, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వస్త్రాలను తయారు చేసి విక్రయిస్తున్న రామ్‌రాజ్ కాటన్ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం కంపెనీ దక్షిణ భారత్‌లో 300కు పైగా షోరూమ్స్‌ను నిర్వహిస్తోంది. కాగా విస్తరణలో భాగంగా వచ్చే రెండేళ్ల కాలంలో షోరూమ్స్‌ను 500కు చేర్చాలని చూస్తున్నట్లు రామ్‌రాజ్ కాటన్ చైర్మన్ కేఆర్ నాగరాజన్ వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం రామ్‌రాజ్ 82 షోరూమ్స్‌ను నిర్వహిస్తుండగా వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్తగా 28 స్టోర్స్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. రామ్‌రాజ్ కాటన్ నాలుగు వేలకు పైగా వెరైటీలతో ప్రపంచంలోనే అతిపెద్ద ధోవతి ఉత్పత్తిదారుగా ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యకలాపాల విస్తరణలో భాగంగా షర్టింగ్, నిట్‌వేర్ విభాగంతో పాటు చీరల విభాగంలోకి కూడా కంపెనీ ప్రవేశించిందన్నారు.ప్రస్తుతం రామ్‌రాజ్ కాటన్ తమిళనాడులో 10, బెంగళూరులో ఒక ప్లాంట్‌ను నిర్వహిస్తోందని నాగరాజన్ తెలిపారు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేందుకు రూ.1,000 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించారు .. అయితే ఇందులో రూ.300 కోట్లు ఇప్పటికే ఖర్చు చేయగా, వచ్చే మూడేళ్ల కాలంలో మిగిలిన రూ.700 కోట్ల మొత్తాలను పెట్టుబడులుగా పెడుతున్నామని నాగరాజ్ చెపుతున్నారు .