లగ్జరీ కార్ల తయారీలో దిగ్గజ కంపెనీ జర్మనీకి చెందిన మెర్సిడెజ్ బెంజ్. తాజాగా భారత్‌లో సి–క్లాస్ సెడాన్ కొత్త వర్షన్ ను దించింది. దీని ధర రూ.55 లక్షల నుంచి మొదలవుతుంది. 1.5 లీటర్ గ్యాసోలిన్ ఇంజన్‌తో సి–220, అలాగే 2.0 లీటర్ డీజిల్ పవర్‌ట్రైన్స్‌తో సి–220డి, 330డి రూపొందించారు. సి–200 రూ.55 లక్షలు, సి–220డి రూ.56 లక్షలు ఉండగా… 330డి ధక రూ.61 లక్షలు ఉంది. మెర్సిడెజ్ సి–క్లాస్ సెడాన్ కొత్త వర్షన్‌కి కస్టమర్ల నుంచి అంచనాలను మించి ఉందని కంపెనీ తెలిపింది. 1,000 పైగా యూనిట్లకు ముందస్తు బుకింగ్స్ ఉన్నాయని చెప్పింది. అది 2–3 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్‌కు దారితీసిందని వెల్లడించింది. ఈ స్థాయి ప్రీ బుకింగ్స్ మెర్సిడెజ్ కు ఇదే తొలిసారి. 2022లో మొత్తం 10 ఉత్పత్తులను పరిచయం చేయాలన్నది సంస్థ లక్ష్యం. వాటిలో సి–క్లాస్ కొత్త వర్షన్‌తో సహా రెండు అందుబాటులోకి వచ్చాయి.