‘మన వాళ్ళు ఎక్కడికెళ్లినా సాఫ్ట్ వేర్ లోనే కాదు.. తినుబండారాలలోను పేరు గడిస్తున్నారు. విదేశీయులకు సైతం నోరూరించే వంటకాలు చేస్తూ ”ఔరా .. భారత్ రుచులు” అంటూ వేనోళ్ళ పొగిడించుకుంటున్నారు’.
అమెరికాలో మన ఇండియన్స్ ఏర్పాటు చేసిన చాయ్పానీ స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్ ఉత్తమ రెస్టారెంటుగా ఎంపికైంది. చికాగోలోని జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ ఏడాదికి గాను ‘చాయ్పానీ’ని ఎంపిక చేసింది. నార్త్ కరోలినాలోని అష్విల్లేలో ఉన్న ఈ రెస్టారెంటు అక్కడున్న వారందరికీ సుపరిచితమే. ఇక్కడ కారం, తీపి, పులుపు రుచులతో లభించే వివిధ రకాల వెరైటీ స్నాక్స్ కోసం భోజన ప్రియులు ఎగబడతారు. ఇక్కడ తయారుచేసే ‘చాట్’ చాలా ఫేమస్. పైగా ఇక్కడ ధరలు కూడా వేరే రెస్టారెంట్లతో పోలిస్తే తక్కువగా ఉంటాయంటారు. అంతేకాదండోయ్య.. అక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది.