‘పడుకునేటప్పుడు ఎత్తు కోసం వేసుకునే తలగడి మహా ఉంటే ఎంతుంటుంది? వెయ్యో, రెండువేలో ఉండొచ్చు. బాగా ధనవంతులు కాస్ట్లీ కావాలనుకుంటే ఓ ఐదారువేలు పెట్టి కొంటారు. కానీ నెదర్లాండ్స్‌లో తయారైన తలగడి రేటు వింటే ఆశ్చర్యం కలుగుతుంది..’
ఈజిప్టు పత్తి, మల్బరీ పట్టు, నెదర్లాండ్స్‌కు చెందిన నాన్-టాక్సిక్ ఫోమ్‌తో తయారు చేసిన తలగడ ఇది. దీని ధర రూ.45 లక్షలు. తయారీకి 24 క్యారట్ల బంగారం ఉపయోగించారు. వజ్రాలు పొదిగారు. అందుకే ఇంత ధర. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ ఔత్సాహికుడు పదిహేనేండ్లు కష్టపడి ఈ తలగడను తయారు చేశారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన తలగడ ఇదే అంటున్నారు.