కల్తీ లేని ఆహారం, పోషకాహారం.. రాబోయే రోజులలో అత్యంత కీలకమైన వ్యాపారం కాబోతోంది. ముఖ్య0గా మిల్లెట్స్ ఫుడ్ బిజినెస్ భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజ్యమేలబోతోంది . దీనిని ముందే గ్రహించిన మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావు మనవరాళ్లు బిజినెస్ లో ఆయన అడుగుజాడలలో వెళ్ళడానికి అడుగువేశారు .
శ్రీ రామోజీరావు పెద్దకుమారుడు, ఈనాడు సీఎండీ కిరణ్ కుమార్తె సారి కొత్తగా మిల్లెట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు . రామోజీరావు జన్మదినం రోజున ఈ బ్రాండ్ ను లాంచ్ చేయడం విశేషం . ”సబల మిల్లెట్స్ ‘ ‘ పేరుతో ఈ బ్రాండ్ లాంచ్ చేశారు. ప్రియా గ్రూప్ కింద ఈ సబల బ్రాండ్ కూడా వ్యాపారం నిర్వహిస్తుంది . సొంతంగా ఆర్ అండ్ డీ పెట్టుకుని సారి . . ముందస్తు ప్రణాళికలతో ముందుకెళుతున్నారు .
రామోజీరావు . .. ఒక్క ఈనాడే కాదు . ..అయన మరెన్నో వ్యాపారాలు చేసారు . అయితే అందులో ఈనాడు , ప్రియా ఫుడ్స్ , మార్గదర్శి చిట్స్ వంటి కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి . సోమా కూల్ డ్రింక్స్ , న్యూస్ టైం ఇంగ్లీష్ పత్రిక వంటి చాలా వ్యాపారాలు రామోజీ సైతం సక్సెస్ చేయలేక మూసివేశారు .
రామోజీరావు ఉన్నప్పుడే మనవరాళ్లకు వారికి ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహించారు. మీడియా విషయంలో మరో మనవరాలు బృహతికి స్వయంగా శిక్షణ ఇచ్చారు. ఈనాడు డిజిటల్ మీడియాను ఈ అమ్మాయే నడిపిస్తున్నారు. ఇతర రంగాల్లోనూ మనవరాళ్లు అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. రామోజీ నిలబెట్టిన సంస్థలను ముందుకు తీసుకెళ్లడం కాకుండా కొత్త బ్రాండ్లను రిలీజ్ చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. రామోజీ మనవరాళ్లు , మనవడు (సుమన్ కుమారుడు ) ఫుడ్ , ఎంటర్ టైన్మెంట్ , మెడికల్ రంగాలలో వినూత్న బిజినెస్ మోడల్స్ ద్వారా మార్కెట్ లోకి రావడానికి ఇప్పటికే పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకున్నారు . త్వరలో మరిన్ని బిజినెస్ మోడల్స్ ద్వారా రామోజీ వారసులను చూడవచ్చు .