టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీని అధికారులు కూల్చివేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ ఛలో నర్సీపట్నం పిలుపునిచ్చింది. అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు హాజరయ్యేందుకు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత పోలీసులను ఏమార్చి ముఖానికి ముసుగు ధరించి ఓ స్కూటర్ పై నర్సీపట్నం చేరుకున్నారు. దీనిపై ఆమె ట్వీట్ చేశారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని ఛేదించుకుని ఛలో నర్సీపట్నం దీక్షాస్థలికి చేరుకున్నట్టు వెల్లడించారు. చింతకాయల విజయ్ దీక్ష విరమింపజేసినట్టు తెలిపారు. ఈ ఉదయం ఓ మహిళా కానిస్టేబుల్ తన ఇంటి వద్ద కనిపించగా, నోటీసుల్లేకుండా తనను గృహ నిర్బంధం ఎలా చేస్తారంటూ అనిత ఆమెను తిప్పిపంపారు.
పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, వారి వలయాలను ఛేదించుకొని ఛలో నర్సీపట్నం దీక్షాస్థలి కి చేరుకొని అనంతరం చింతకాయల విజయ్ గారిచే దీక్ష విరమింపజేయడం జరిగింది. pic.twitter.com/rhqy9IAM9h
— Anitha Vangalapudi (@Anitha_TDP) June 20, 2022