Pawan Kalyan: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష విర‌మణ

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ క‌ల్తీ నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల 11 రోజుల పాటు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష‌ను విరమించారు. ఇవాళ‌ తిరుమ‌ల వేంకటేశ్వరస్వామిని ద‌ర్శించుకున్నారు.  తిరుమలకు కాలినడకన చేరిన ఆయ‌న‌కు గొల్ల మండ‌పంలో పండితులు ఆశీర్వ‌చ‌నం అందజేశారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి చిత్ర‌ప‌టం, తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు.

ప‌వ‌న్ త‌న ఇద్ద‌రు కుమార్తెలు ఆద్య‌, పొలెనా అంజ‌నతోపాటు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద్‌సాయితో క‌లిసి ఆయన స్వామివారి సేవ‌లో పాల్గొన్నారు. స్వామివారి ద‌ర్శ‌నానంత‌రం పవన్  త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌దాన స‌త్రానికి వెళ్లి ప‌రిశీలించారు. ఇక శ్రీవారి ద‌ర్శ‌నం త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌వ‌న్ చేతిలో వారాహి డిక్ల‌రేష‌న్ బుక్ క‌నిపించింది. ద‌ర్శ‌నానికి వెళ్లిన స‌మ‌యంలో త‌న వెంట ఈ డిక్ల‌రేష‌న్ పుస్త‌కం తీసుకెళ్లారు.