.. పవన్ టార్గెట్…. చంద్రబాబు మెతక వైఖరిపైనే …

 అత్యాచార నిందితులను అరెస్ట్ చేయడానికి కులం అడ్డొస్తుందా ?  అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  పోలీసులపై చేసిన వ్యాఖ్యలు,, హోంమంత్రి బాధ్యత వహించాలి . .అంటూ అనితపై చేసిన కామెంట్స్.. సీఎం చంద్రబాబు మెతక వైఖరిపైనే అని స్పష్టంగా తెలుస్తోంది. తాను హోంమంత్రి అయితే చర్యలు తీవ్రంగా ఉంటాయంటూ   పవన్ చేసిన హెచ్చరికలను సాదాసీదాగా కొట్టిపారేయకూడదు.  పవన్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యల వెనుక అయన ఆవేదన ఉంది. వైసీపీ పాలనలో పోలీసులు వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టినా . … కూటమి సర్కారు పాలనలోనూ పోలీసుల వైఖరిలో పెద్ద మార్పురాలేదంటే దానికి కారణం పోలీసులదో ,  హోంశాఖను నిర్వహిస్తున్న అనితానో తప్పుపట్టక్కర్లేదు . . వీటన్నింటికీ  సీఎం చంద్రబాబుదే బాధ్యత.  

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తను హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయని చేసిన  హెచ్చరిక వెనుక  ఉన్న మరోకోణాన్ని అర్ధం చేసుకోవాలి .    ” అత్యాచారం నిందితుల్ని అరెస్టు చేయడానికి కులం అడ్డొస్తోందా..?   పోలీసు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా ” అంటూ పవన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సి ఉంటుంది .

 పవన్ ఆవేదనలో అర్ధం ఉంది :  శాంతిభద్రతలు చాలా కీలకమైనవని సమాజంలో చిచ్చు పెట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భావ ప్రకటనా స్వేచ్చ అంటున్నారని ఇలాంటి వారిపై కూడా చర్యలు లేకపోతే చేతకాని వాళ్ళం అవుతామంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేయడం కరక్టే అనిపిస్తుంది. చిత్తూరు జిల్లాలో చిన్నారిపై జరిగిన  అత్యాచార ఘటనపై పోలీసుల నిర్ల్యక్ష్య వైఖరిని పరిశీలిస్తే . ..సీఎం చంద్రబాబుపై పోలీసు అధికారుల్లో సైతం ఏమాత్రం భయం కానీ ,  గౌరవం కానీ లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అభివృద్ధి ఒక్కటే సరిపోతుందా?  సీఎంగా అధికార పీఠం ఎక్కునప్పటి నుంచీ చంద్రబాబు అభివృద్ధి నినాదంతోనే ముందుకు వెళుతున్నారు .  ఎవరూ కాదనలేం . .అభివృద్ధి అవసరమే. దీనికంటే లా అండ్ ఆర్డర్ ఇంకా ముఖ్యం అన్న సంగతి చంద్రబాబుకీ తెలుసు . ..అయినా 2024లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచీ ఆయన మెతక వైఖరి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  రాష్ట్రంలో అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న చంద్రబాబు కార్యాచరణలో ఫెయిల్ అవుతున్నారు. అరాచక శక్తులపై చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలు ఆచరణలోకి రావడంలేదనే చెప్పాలి. 

పేట్రేగిపోతున్న సోషల్ మీడియా :   విజయవాడ వరదలకు గురైన సమయంలో అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ సోషల్ మీడియా కోడై కూసింది. తిరుమల లడ్డులో నెయ్యి కల్తీ , , ఇలా పలు వ్యవహారాలలో సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నా ,,, చర్యలు తీసుకోవడంలో ఏపీ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు టీడీపీ ,  జనసేన నేతలు నుంచే ఎక్కువగా వస్తున్నాయ్. సీఎం ,  డిప్యూటీ సీఎం లనే చంపేస్తామని సోషల్ మీడియా వేదికగా మెసేజ్ లు చేస్తున్న వారిని సైతం నిలువరించలేని దయనీయ స్థితి చంద్రబాబు సర్కార్ కి ఎందుకు వస్తోంది ?? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడంలేదు.

పవన్ ధిక్కార స్వరం కరెక్టే: అత్యాచార ఘటనలలో సైతం నిర్ల్యక్షం వహిస్తున్న పోలీసు వ్యవస్థను దారికి తీసుకురాలేని సీఎం ఎంత అభివృద్ధి చేస్తే మాత్రం ఫలితం ఉంటుంది .  ప్రజా మన్నన పొందుతారు .  చంద్రబాబు చెపుతున్న మాటలకు ,  చేస్తున్న చర్యలకు పొంతన ఉండటంలేదు .  చేసిన కొన్ని మంచి పనులను బాగా ఫోకస్ చేసుకోవడంలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు .  ప్రతీకార చర్యలకు పాల్పడితే రాష్ట్రములో అభివృద్ధి వెనుకబడుతుందని పదే పదే ప్రస్తావిస్తున్న చంద్రబాబు వైఖరిని గమనిస్తే . . అరాచకులను సైతం శిక్షించే పరిస్థితి కనిపించడంలేదని సామాజికవేత్తలు బాహాటంగా చేస్తున్న విమర్శలపై చంద్రబాబు అండ్ కో పునఃపరిశీలన చేసుకోవాలి .  ఇలాంటి దుస్థితిలో పవన్ కళ్యాణ్ ధిక్కార స్వరం వినిపించడం కరెక్టే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు .

”నేను హోంమంత్రి పదవి తీసుకుంటే   ఇలా ఉండదు. తీవ్రమైన చర్యలు ఉంటాయి . .” అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం . .. అయన ఒంటెద్దు పోకడలను బయటపెడుతోంది. ఏ పదవి కావాలంటే ఆ పదవి తీసుకునే ఛాన్స్ పవన్ కి ఉందా ?  కూటమి సర్కార్ లో తనెంత చెపితే అంత . .. అన్న రీతిలో మాట్లాడటం పవన్ స్థాయి నాయకుడికి కరెక్ట్ కాదు. ఇలాంటి తొందరపాటు కామెంట్స్ చేయకుండా పవన్ కాస్త సంయమనంతో వ్యవహరిస్తే ఇంకా మెరుగైన రాజకీయ భవిష్యత్తు ఆశించవచ్చు .