”ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి కాన్వ్యాయ్ వాహనాలు ఇటీవల ప్రమాదానికి గురయ్యాయి . ఏపీ , తెలంగాణలలో మంత్రుల కాన్వాయ్‌లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి . వాటిని నివారించడానికి పరిస్కారాలు ఇవిగో . ..
మంత్రులు ఇతర వివిఐపి ల కాన్వాయ్ ప్రమాదాల వార్తలు చాలా చూస్తున్నాం ఈమధ్య..
దీనికి ఒక కారణం కాన్వాయ్ లో అనవసర వాహనాలు ఉండడం!
రెండో కారణం మితిమీరిన వేగంతో వెళ్లడం!
మంత్రి ప్రయాణించే కారు, భద్రత కారణాల రీత్యా ఇంకో కారు, పైలట్, ఎస్కార్ట్ వాహనాలు కాన్వాయ్ లో ఉంటే చాలు. ఇవి కూడా ఫెవికాల్ తో అంటించినట్లు వెంట్రుకవాసి దూరంలో వేగంగా వెళ్ళక్కర్లేదు..
పైలట్ కి విఐపి వెహికల్ కి అలాగే ఎస్కార్ట్ వెహికల్ కి విఐపి వాహనానికి మధ్య గ్యాప్ ఉండడంలేదు.
కాన్వాయ్ ఒక్కసారిగా వంద కిలోమీటర్ల స్పీడ్ తో సైరన్ మోగించుకుంటూ వచ్చేస్తుంటే సాధారణ ట్రాఫిక్ బెదిరిపోతుంది. ఆ ఒత్తిడిలో కొందరు కంగారుపడి రోడ్డు పక్కకి వెళ్లలేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది.
కాన్వాయ్ లో కార్లే ఒకదాన్ని ఇంకోటి గుద్దుకుంటున్నాయంటే తేడా కాన్వాయ్ లోనే ఉందని తెలియకపోతే ఎలా?
మొదట కాన్వాయ్ స్పీడ్ కి ఓ అదుపు పెట్టండి. ఇప్పుడు అంత గాల్లో వెళ్ళిపోయి పొడిచేసే రాజకార్యలేమీలేవు మీకు.. మాకు తెలుసు! ఒకవేళ ఉన్నప్పటికీ, మీ ప్రాణాలకంటే ఎక్కువ కాదు.
రెండోది.. కాన్వాయ్ లో ఎక్కువ వాహనాలు ఉండకుండా చూసుకోండి!
ఈ మార్పులు వివిఐపిలు భద్రతకు చాలా అవసరం.
మంత్రి కారుని ఎస్కార్ట్ కారు కొట్టేసిందని, లేదా పైలట్ వెహికల్ ని మంత్రి గారి కారు ఢీకొందని చెబితే వినడానికి చాలా బాగోదు!! కాన్వాయ్ వాహనాల డ్రైవర్స్ కి అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలి .
విఐపి కాన్వాయ్ ల వలన ప్రజలకు జరుగుతున్న ఇబ్బందిని నివారిస్తే.. అప్పుడు కాన్వాయ్ ప్రమాదాలు కూడా తగ్గుతాయి!