కోనసీమ జిల్లాను ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పూర్తి స్థాయిలో మార్పు చేసారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ గెజిట్ను విడుదల చేసింది. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కోనసిమా జిల్లా ఏప్రిల్ 4న అమలులోకి వచ్చింది. అయితే వివిధ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు కోనసీమ జిల్లా పేరుమార్పు విషయమై మే 18న ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసింది. జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమగా మారుస్తున్నామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని అందులో పేర్కొన్నది. అయితే దీనిపై అమలాపురంలో ప్రజలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడికూడా చేసిన విషయం తెలిసిందే. జిల్లా పేరును మారుస్తూ జూన్ 24న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తాజాగా తుది గెజిట్ను కూడా విడుదలచేసింది. దీంతో కోనసీమ జిల్లా ఇప్పుడు ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా’గా నామకరణం చెందింది.