జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అధికారంలో క్యాంప్ కార్యాలయం ఎగ్ పఫ్ ల కోసం చేసిన ఖర్చు 3.62 కోట్లట
మైనింగ్ , లిక్కర్ , ల్యా0డ్స్ కుంభకోణాలే కాదు . . ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ దోచేసుకున్నారు . అవకాశాలు లేనిచోట్ల కూడా వెతికిమరీ సృష్టించుకుని అందినంతా తినేశారు . . జగన్ ఐదేళ్ల పాలనలో . ..ఆంధ్రప్రదేశ్ ను గుల్ల చేసేసారు . అక్రమాలకు సంబంచిన ఒక్కో ఆధారం బయటపడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది . అవినీతి , అక్రమాలు ఈ స్థాయిలో కూడా చెయ్యొచ్చా ? అని నోరెళ్లబెట్టడం సామాన్యుడి వంతవుతుంది .
2019-2014 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సమయంలో అతని క్యాంప్ కార్యాలయం అధికారులు , సిబ్బంది 18,12,835 ఎగ్ పఫ్ లు తిన్నారట . అంటే రోజుకి . .993 ఎగ్ పఫ్ లు అప్పటి సీఎం క్యాంప్ కార్యాలయం తినేసిందన్న మాట . ఇందుకోసం సర్కార్ ఖజానాకు మాత్రం 3 కోట్ల , 62 లక్షల 6 వేళా 700 రూపాయలు బొక్క పెట్టారు .
ఒక్క ఎగ్ పఫ్ లే ఇన్ని తిన్నారంటే . .. వెజ్ పఫ్ లు , కేకులు , ఇతర స్నాక్స్ ఎన్ని తిన్నారో , ఎన్ని కోట్ల బిల్లు పెట్టారో తెలియాల్సిన అవసరం ఉందంటూ సోషల్ మీడియాలో చురకలు వేస్తున్నారు .