”వెయిటింగ్ లో ఉన్న ఐపిఎస్ అధికారులు హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండాలి . ..” అంటూ ఏపీ డీజీపీ జారీ చేసిన ఆదేశాలతో వైసీపీ పాలనలో ఆ పార్టీకి , జగన్ కి తొత్తులుగా వ్యవహరించిన అధికారులపై ద్రుష్టి సారించినట్లు సంకేతాలు ఇచ్చారు . తోలి విడతగా దుర్మార్గన్గ్ వ్యవహరించిన 16 మంది IPS అధికారులపై ఫోకస్ పెట్టారు .
నెక్స్ట్ స్టెప్ ఐఏఎస్ . . 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 20-25 మంది ఐఏఎస్ అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు . వీరిలో చాలామంది చేసిన అక్రమాలు , అరాచకాలపై ఇప్పటికే చాలా వరకు ఆధారాలు సేకరించి పెట్టుకున్న ఏపీ సర్కారు . .. కొన్ని రోజులలో వారిపై చర్యలకు ఉపక్రమించనుంది .
ఐపిఎస్ లకు అవమానం . . అయినా భరించాలి కదా . .
వెయిటింగ్ లో ఉన్న ఐపిఎస్ అధికారులు రెగ్యులర్ గా ఉదయం ఆఫీస్ కు రావటం తో పాటు సాయంత్రం కూడా ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత రిజిష్టర్ లో సంతకం చేసి వెళ్లాలని డీజీపీ ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. మొత్తం పదహారు మంది సీనియర్ ఐపీఎస్ లకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ఇందులో పీఎస్ ఆర్ ఆంజనేయులు, పీ వి సునీల్ కుమార్, ఎన్ .సంజయ్, కాంతి రానా టాటా, జీ. పాల రాజు , కొల్లి రఘురామిరెడ్డి, ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, సి హెచ్ విజయరావు, విశాల్ గున్ని, అన్బురాజన్ , వై .రవిశంకర్ రెడ్డి, వై. రిషాంత్ రెడ్డి, కె . రఘువీరారెడ్డి, పీ. పరమేశ్వర్ రెడ్డి, పీ. జాషువా, కృష్ణకాంత్ పటేల్ లు ఉన్నారు. తాజాగా డీజీపీ జారీ చేసిన ఆదేశాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారాయి. గత జగన్ సర్కారులో నిబంధలు పక్కన పెట్టి ఇష్టానుసారం వ్యవహరించిన వాళ్ళు ఇప్పుడు కర్మ ఫలితం అనుభవిస్తున్నారు .
ఐఏఎస్ లు ఎవరు ? జగన్ అక్రమాలకు కొమ్ము కాసిన ఐఏఎస్ అధికారులు జాబితా . . వారు పాల్పడిన అక్రమాలకు సంబందించిన కొన్ని ఆధారాలు సేకరించారు . మురళీధర్ రెడ్డి , ధనుంజయ రెడ్డి , విశాఖ కలెక్టర్ గా పనిచేసిన మల్లిఖార్జున , అన్నమయ్య కలెక్టర్ గా చేసిన గిరీషా , గుంటూరు కలెక్టర్ గా చేసిన వేణుగోపాల్ రెడ్డి , తదితరులు అడ్డగోలుగా చేసిన అక్రమాలపై రికార్డెడ్ ఎవిడెన్స్ సిద్ధం చేసినట్లు పలువురు అధికారులే చెపుతున్నారు . ఇలా మొత్తం . . 25 మంది వరకు ఐఏఎస్ అధికారుల జాబితా తయారు చేసారు . వీరిపై వచ్చే నెలలో చర్యలకు ఉపక్రమించనున్నట్లు సమాచారం . .