ఏపీ (AP State) లోని పత్తి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పత్తి పంట (Cotton) ను సీసీఎల్ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రులు (Ministers) అచ్చెన్నాయుడు, సవిత తెలిపారు.
పత్తి సాగు, ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా(Financial security) కలిగించే విధంగా నూతన వంగడాల అభివృద్దికి చర్యలు తీసుకుంటామని మంత్రులు పేర్కొన్నారు. అదేవిధంగా రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తేనే సెస్ తొలగిస్తామని పత్తి స్పిన్నింగ్, జిన్నింగ్ వ్యాపారుల (Spinning and ginning merchants) కు సూచించారు. ఈ నేపథ్యంలో రైతుల వద్ద నుంచి పత్తి పంట మొత్తాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీసీఎల్ మరియు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. అనంతరం ఈ -క్రాప్ లో పత్తి రైతులు తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achchennaidu) తెలిపారు. ఈ క్రాప్ లో నమోదు చేసుకోవడం వలన ప్రభుత్వం ద్వారా అందే ఫలాలపై రైతులకు అవగాహన (Awareness to farmers) కల్పించాలని అధికారులకు సూచించారు.