AP Assembly Session: 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నేడు ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబరు 11 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు జరగనున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతేగాకుండా, పలు చట్ట సవరణ బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.  ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాత్కాలిక ప్రాతిపదికన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుండగా, తాజా అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ తీసుకురానున్నారు.