Amaravathi: అమరావతి . . ఇక పరుగే . .పరుగు . .

ప్రపంచ బ్యాంక్ ఒకటి కాదు . .రెండు కాదు . . ఏకంగా 15 వేల కోట్లు అమరావతి అభివృద్ధికి ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. ఇది లోనే. అయితే ఆంధ్రప్రదేశ్ తీర్చక్కర్లేదు.  కేంద్రమే ఈ రుణాన్ని తీరుస్తుంది.

ప్రపంచ బ్యాంక్ ‘లోన్’ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అమరావతిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకోనున్నాయి.  2019-2024 వైసీపీ అధికారంలో ఉన్నప్పు డు అప్పటి సీఎం జగన్ అమరావతిపై కక్ష్య కట్టి …మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చి . . అమరావతిని అధఃపాతాళానికి తొక్కాలని చేయని ప్రయత్నం లేదు .

కూటమి ప్రభుత్వం అధికారంలోకి  వస్తుందన్న అంచనాతో ఎన్నికలకు పది , పదిహేను రోజుల ముందు . . 20, 30 శాతం . . అధికారంలోకి వచ్చిన వెంటనే  100 శాతం అమరావతిలో భూముల ధరలు పెరిగాయి.   అయితే అమరావతి ఇదే రీతిలో వేగవంతంగా ముందుకుపోతుందన్న అంచనాలతో హైదరాబాద్ లో పెట్టుబడులను ఉపసంహరించుకుని ఇక్కడకు తేవాలని భావించిన తెలంగాణలో స్థిర పడిన ఆంధ్రులు. . వైసీపీ  అరాచకాలను,  జగన్ దుందుడుకు చర్యలను చూసి భయపడుతున్నారు .  వీటిని కట్టడి చేయడంలో చంద్రబాబు ,  పవన్ కళ్యాణ్ విఫలమవుతున్నారన్న అసహనం పార్టీల కేడర్లో బలంగా నాటుకుపోయింది. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా వరల్డ్ బ్యాంక్ 15 వేల కోట్ల రుణంతో అమరావతి , పరిసర ప్రాంతాలలో అభివృద్ధి కాస్త వేగవంతం కానుంది.