ALERT IN AP:బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన

Rain Alert in Andhra : బంగాళాఖాతంలో అల్పపీడనం                                                                          ఎడతెరిపిలేని వర్షాలు కురిసి పది రోజుల గడువు తర్వాత మరో అలెర్ట్ . .                         పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ   వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ  ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు  వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు ,  బాపట్ల,  ప్రకాశం, కర్నూలు, అనంతపురం ,  నంద్యాల,   శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు .    మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, ప్రకాశం, పార్వతీపురం మన్యం, చిత్తూరు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. సోమవారం ఉదయం 10-10.30 సమయంలో కాకినాడ , అంబెడ్కర్ కోనసీమ ,  అల్లూరి జిలాలలో  పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది .