ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మనీలాలో నిర్వహిస్తున్న “ఈస్ట్ ఎవెన్యూ మెడికల్ సెంటర్” కీ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వద్ద గల జిఎస్ఎల్ వైద్య, వైద్యవిద్యా సంస్ధలకీ మధ్య నాలెడ్జ్ ఎక్సేంజ్ ఒప్పందం కుదిరింది.
ఈ ఎంఒయు మేరకు ఫిలిప్పీన్స్ వైద్య విద్యార్థులు రాజానగరం వస్తారు. ఇక్కడి విద్యార్థులు మనీలా వెళ్తారు. ప్రొఫెసర్లు కూడా అక్కడినుంచి ఇక్కడికి, ఇక్కడినుంచి అక్కడికి మారుతూ వుంటారు.
ఈస్ట్ ఎవెన్యూ మెడికల్ సెంటర్ ఇఎన్ టి విభాగం అధిపతి, డాక్టర్ రెనె లూయీ గుటిరెజ్ ( RENE LOUIE GUTIERREZ) జిఎస్ఎల్ సంస్ధల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు ఎంఒయు పై సంతకాలు చేసి పరస్పరం ఫైళ్ళు మార్చుకున్నారు.
జిఎస్ఎల్ కేన్సర్ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గోగినేని తరుణ్, జిఎస్ఎల్ డెంటల్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్ గోవిందరాజులను తమ సెంటర్ కు విజిటింగ్ ఫాకల్టీగా నియమించుకున్నామని డాక్టర్ రెనె లూయీ చెప్పారు. తమదేశం నుంచి ఏటా ఇద్దరు విద్యార్ధులు జిఎస్ ఎల్ సంస్థల్లో చదువుకుంటారని, ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సంస్ధ విదేశాలనుంచి ఫాకల్టీని నియమించకోవడం ఇదే మొదటి సారని చెప్పారు. తమ రెండు సంస్ధలూ సంయుక్తంగా 2024 మార్చి 25,26,27 తేదీల్లో ఇఎన్ టి, ఈస్టటిక్స్ ఆంకాలజీ సర్జరీలపై అంతర్జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. డాక్టర్ రెనె లూయూతో పాటు అదేవిభాగం ఫ్యాకల్టీ డాక్టర్ కార్ లో (CARLO PRAGARAGAN), డాక్టర్ ఫెన్నానివాన్ (FERAANIWAN)కూడా ఫిలిప్పీన్స్ నుంచి వచ్చారు.

విజ్ఞానాలు ఇచ్చుపుచ్చుకునే ఒప్పందాలపై జిఎస్ఎల్ సంస్ధల మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ గన్ని సందీప్ దేశదేశాల్లోని పలు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
జిఎస్ఎల్ సంస్థలకు శ్రీలంకలోని ప్రభుత్వ యూనివర్సిటీ “పెరందీనియా” కు మధ్య కూడా కుదిరిన అవగాహన మేరకు మార్చి 16,17,18 తేదీల్లో పెరిందీనియా యూనివర్సిటి, కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీస్, జిఎస్ఎల్ సంస్ధలు సంయుక్తంగా కొలంబోలో మొదటి అంతర్జాతీయ నెక్ అండ్ ఓరల్ కేన్సర్ సర్జరీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. డాక్టర్ తరుణ్, డాక్టర్ గోవిందరాజు అక్కడ కీలకోపన్యాసాలు చేశారు. డాక్టర్ గన్ని సందీప్ ఎంఒయు పై సంతకంచేశారు. శ్రీలంకనుంచి నుంచి ఏటా ఒక విద్యార్థి వచ్చి జిఎస్ఎల్ సంస్ధల్లో చదువుకుంటారు.
ఈ పరిణామాలపై జిఎస్ఎల్ సంస్ధల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు “ జిఎస్ఎల్ గోస్ గ్లోబల్” అని వ్యాఖ్యానించారు. దక్షిణాసియా దేశాలు తలుపుతీయగానే భారతదేశపు తూర్పుతీరం, అందులో పొడవైన తీరం వున్న ఆంధ్రప్రదేశ్ కాంతివంతంగా కనిపిస్తాయి. భౌగోళిక ఉనికి, మానవవనరుల సామర్థ్యాల వల్ల మనకు ఈ కాంతి వచ్చింది. గ్లోబలీకరణ వల్లనే దేశదేశాల మధ్య ఒప్పందాలు సులభతరమౌతున్నాయి. నాలెడ్జ్ ఇచ్చిపుచ్చుకోవడంలో జిఎస్ఎల్ సంస్ధలు మరో రెండడుగులు ముందుకి వేసింది. భవిష్యత్తులో మరికొన్ని ముందడుగులు వేయగలుగుతాము” అన్నారు.