ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయ్. రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక బలమైన circulation ఏర్పడింది. ఇది చాలా వేగంగా బలపడు తుంది. రేపు (గురువారం) సాయంత్రం కు కాకినాడ & విశాఖ తీరంకు అతి చేరువుగా ( 50km ) వచ్చిన తర్వాత తన దిశ ను కొద్దిగా మార్చుకుని కాకినాడ నుంచి తీరం వెంబడి మరియు తీరంని అనుకొని 2 రోజులు ప్రయాణించనున్నది. తర్వాత దశలో ఒరిస్సా భువనేశ్వర్ &బాలాసూర్ మధ్య తీరం దాటనుంది. సుదీర్ఘంగా తీరం వెంబడి ప్రయాణించనున్నందున రేపటి నుండి ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పెరగనున్నాయి. 9,10 తారీఖులలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా శ్రీకాకుళం మొదలు ప్రకాశం వరకూ భారీ వర్షాలు పడనున్నాయి. మిగిలిన దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమ లో ఒక మోస్తరు వర్షాలు పడనున్నాయి. 10,11 తారీఖులలో ఉత్తర & తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీవర్షాలు పడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో 8 , 9, 10 ,11 తారీఖులలో ముసురువాతావరణం వుంటుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే 15/16 ,తారీఖులలో మరొక అల్పపీడనం.ఒరిస్సా & పశ్చిమ బెంగాల్ మధ్య ఎర్పడనున్నాది. అలాగే ముంబై ని అనుకొని అరేబియా సముద్రంలో 14, 15 తేదీ లలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. \
గోదావరికి వరద ముప్పు
అల్పపీడన ప్రభావంతో ఏపీ తో పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఎగువ నుంచి వచ్చే వరద నీటితో ఈ నెల 13, 14 తేదీల నాటికి గోదావరికి మరింత వరద ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది.