రచనలు మేధావులనే కాకుండా . . సామాన్య పాఠకులను చదివించే ఆసక్తికర రీతిలో ఉండాలని . . గోళ్ళ నారాయణ అభిప్రాయపడ్డారు . అలాగే పఠనాసక్తిని పెండడానికి రచయితలు ద్రుష్టి సారించాలన్నారు . పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ జమ్ముల చౌదరయ్య రాసిన… ‘జీవితం – ఒక అవగాహన’ పుస్తక ఆవిష్కరణ విజయవాడ బుక్ ఫెస్టివల్ లో జరిగింది . రామోజీరావు సాహిత్య వేదిక పై జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు . పుస్తక మహోత్సవ సంఘ గౌరవాధ్యక్షుడు బి . బాబ్జి మాట్లాడుతూ . . జీవితాన్ని సునిశితంగా పరిశీలించి . .చౌదరయ్య ఈ పుస్తకాన్ని రచించారన్నారు . కార్యక్రమంలో జయరాజు , వెలగా జోషి , లంకా జనకయ్య , పుస్తక రచయిత జమ్ముల చౌదరయ్య తదితరులు పాల్గొన్నారు .