బైబిల్‌పై ప్రమాణం చేయాలన్న షర్మిల సవాల్ జగన్ స్వీకరిస్తారా ?

సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం కుంభకోణంలో అదానీ కంపెనీ నుంచి మామూళ్లు తీసుకోలేదని జగన్ బైబిల్ పై ప్రమాణం చేయగలరా ? … అంటూ pcc chief YS షర్మిల చేసిన సవాల్ ను అన్న జగన్ స్వీకరిస్తారా ? లంచాలు మింగలేదని మీడియాలో గొంతెత్తుకుని అరుస్తున్న జగన్మోహన్ రెడ్డి . .. అవే వ్యాఖ్యలను బైబైల్ పై ప్రమాణం చేసి చెప్పగలిగే సాహసం చేస్తారా ? ?? ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా ఇదే నడుస్తోంది .

  • అబద్ధాలను అందంగా అల్లినందుకు జగన్‌కు ఆస్కార్ ఇవ్వాలి: షర్మిల
  • సన్మానాలు కోరుకొనే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు జవాబివ్వాలి: షర్మిల
  • యూనిట్ ధర రూ.2.14 ఉంటే.. జగన్‌ రూ.2.49కు కొన్నారు: షర్మిల
  • ఎక్కువ ధర చెల్లించి కొన్నందుకు జగన్‌ను సన్మానించాలా?: షర్మిల
  • అదానీ వద్ద గుజరాత్ రూ.1.99 పైసలకే విద్యుత్‌ కొన్నది: షర్మిల
  • మీరు యూనిట్‌కు 50 పైసలు ఎక్కువ పెట్టి కొన్నారు: షర్మిల
  • అదానీతో ఒప్పందానికి మిగిలిన రాష్ట్రాలు ముందుకు రాలేదు: షర్మిల
  • ఆగమేఘాలపై ఒప్పందం చేసుకున్న జగన్‌ను సన్మానించాలా?: షర్మిల
  • సీఎంను వ్యాపారవేత్తలు గోప్యంగా కలవడం ఎక్కడైనా ఉందా?: షర్మిల
  • అదానీతో మీ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు.. అంతర్జాతీయంగా చరిత్రే: షర్మిల
  • రూ.1,750 కోట్లు నేరుగా సీఎంకు ముడుపులు ఇవ్వడం చరిత్రే: షర్మిల
  • ఎవరూ కొనని విద్యుత్‌ను బంపర్ ఆఫర్‌గా ప్రకటించుకోవడం చరిత్రే: షర్మిల
  • గంటల్లోనే క్యాబినెట్ సమావేశం పెట్టడం చరిత్రే: షర్మిల
  • ప్రజాభిప్రాయం లేకుండా ఒప్పందాలకు ఆమోదం చరిత్రే: షర్మిల
  • అదానీ కోసం అన్ని టెండర్లు రద్దుచేయడం కూడా చరిత్రే: షర్మిల
  • ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలపై భారం మోపుతారా?: షర్మిల
  • ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్రే: షర్మిల
  • ప్రపంచమంతా మీ అవినీతి గురించి మాట్లాడుకోవడం చరిత్రే: షర్మిల
  • ప్రపంచ అవినీతిపరుల జాబితాలో మీపేరు చేరడం పెద్ద చరిత్రే: షర్మిల
  • అమెరికా కేసులో నా పేరు ఎక్కడుందని జగన్‌ బుకాయిస్తున్నారు: షర్మిల
  • ఏపీ సీఎం అంటే ఆనాడు జగన్‌మోహన్‌రెడ్డి కాదా?: షర్మిల
  • సీఎం కుర్చీలో మీరు కాక.. మిమ్నల్ని నడిపించే వాళ్లు కూర్చున్నారా?: షర్మిల
  • ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం?: వైఎస్‌ షర్మిల
  • జగన్‌ అవినీతి చేశారని అమెరికా దర్యాప్తు సంస్థలే చెప్పాయి: షర్మిల
  • జగన్‌ అవినీతిపై ఎఫ్‌బీఐ, ఎస్‌ఈసీ నివేదికలు ఇచ్చాయి: షర్మిల
  • గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఎల్‌ చేసుకుందని జగన్‌ అన్నారు: షర్మిల
  • జగన్‌ అధికారంలోకి వచ్చాక గాడిదలు కాశారా?: షర్మిల
  • అదానీకి 25 ఏళ్లు రాష్ట్రాన్ని జగన్‌ తాకట్టు పెట్టారు: వైఎస్‌ షర్మిల
  • రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినందుకు జగన్‌కు ఎంత ముట్టిందో అర్ధమవుతోంది: షర్మిల
  • గంగవరం పోర్టును రూ.640 కోట్లకే జగన్‌ అమ్మేశారు: షర్మిల
  • గంగవరం పోర్టును అమ్మినప్పుడే ముడుపుల బంధం తెలిసిపోయింది: షర్మిల
  • రాష్టాన్ని బ్లాంక్ చెక్కులా అదానీకి జగన్‌ కట్టబెట్టారు: షర్మిల
  • అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని జగన్‌ బైబిల్‌పై ప్రమాణం చేస్తారా?: షర్మిల
  • దమ్ముంటే ఈ సవాల్‌ను జగన్ స్వీకరించాలి: వైఎస్‌ షర్మిల
  • నేను అడిగిన ఈ ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పి తీరాలి . . లేకపోతె అతను పిరికివాడిగా వెనుతిరిగి పారిపోయినట్లే లెక్క . .. అని షర్మిల పేర్కొన్నారు .