మరీ హుషారు ఎక్కువైనా, ఆవేశంగా మాట్లాడుతున్నా.. కాస్త ఆచి-తూచి మాట్లాడితే నోరు అదుపులో ఉంటుంది. మనిషికి ఉత్సాహం వచ్చిన ఆవేశం వచ్చినా ఆగదన్నట్లు ఏపీలో ఓ మంత్రి అత్యుత్సాహంతో విచక్షణ మరిచి సొంత పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్నే రెడ్డినే తూలనాడారు. ప్రతిపక్షనేత చంద్రబాబుపై ధ్వేషంతో తన ప్రసంగాన్ని ఆవేశంతో కొనసాగిస్తూ చంద్రబాబు బదులు…” ఏపీ సీఎం వైఎస్ జగన్ ఔట్‌డేటెడ్ పొలిటీషియన్ ” అని తీవ్ర స్వరంలో గద్దించడం., గమనార్హం. సామాజిక న్యాయభేరి పేరిట ఏపీ మంత్రులు నిర్వహిస్తున్న బస్సు యాత్ర మూడో రోజు కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 16 మంది వైసీపీ మంత్రులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. గన్నవరం వద్ద నిర్వహించిన సభలో ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అదే జోష్‌లో మాట్లాడుతూ ”అధికారం కోల్పోయి ఈర్ష్య, ధ్వేషం, కుళ్లు , కుతంత్రాలు దుర్మార్గంగా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఔట్ డేటెడ్ పొలిటీషియన్” అని నోరు జారారు. తర్వాత నాలిక్కరుచుకున్నా.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మంత్రి కారుమూరి వ్యాఖ్యలు అధికార వైసీపీలో దుమారం రేపుతున్నాయి.