తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో దారుణం చోటుచేసుకుంది. రాజానగరం జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్ను మరో విద్యార్థి కత్తితో పొడిచాడు. ఎగ్జామ్ హాల్లోకి వచ్చిన ఆ విద్యార్థి.. టీచర్ల ముందే ఈ దారుణానికి ఒడిగట్టాడు.
తమ కళ్లముందే ఒక విద్యార్థి.. మరో విద్యార్థిని కత్తితో పొడవడం చూసి ఎగ్జామ్ హాల్లో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అనంతరం తేరుకుని గాయపడిన విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే వీరి మధ్య ఘర్షణకు కారణమని తెలుస్తోంది.