సంక్రాంతి పండగ తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రత్యేకం. అందునా ఆంధ్రప్రదేశ్ లో మరీను . పండుగ రోజుల్లో ఉభయగోదావరి జిల్లాల్లో ఉండే సందడి గురించే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇళ్లలో పసందైన వంటకాలకు తోడు ఊళ్లలో కోడి పందేలు, ప్రభలు, డాన్స్ పోటీలు, రికార్డింగ్ డాన్సులు, ఆర్.కె.స్ట్రా గానా, భజానాతో పాటు గుండాటలు, సినిమాలు ఇలా మూడు రోజుల సమయం అంతా మూడు క్షణాల్లో గడిచిపోయేలా అనిపిస్తుంది.
రికార్డింగ్ డాన్సులు, ప్రభలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట, లొల్ల , రావులపాలెం, మగతపల్లి, తూర్పుపాలెం, కారవాక, కేసనపల్లి, నాగుల్లంక, జగ్గయ్యపేట . , మేడపాడు, రాజోలులో రికార్డింగ్ డాన్సులు ఎంతగానో అలరిస్తాయి. వీటిని చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తారు. అవిడి, జగ్గన్నతోట, తాడితోట తదితర ప్రాంతాలలో జరిగే ప్రభల తీర్థం వేడుకలో లక్షలాదిగా పాల్గొంటారు.
కోడి పందేలకు కేరాఫ్
కోడి పందేలు ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం , రాజోలు , దివాన్ చెరువు , వేట్లపాలెం , యానాం తదితర ప్రాంతాలు ఫెమస్ . పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఎంతో ప్రత్యేకం. వెంప, ఐభీమవరంలో జరుగుతుంటాయి. పెద్ద పెద్ద మైదానాల్లో, ఫ్లడ్ లైట్ల వెలుతురులో క్రీడా పోటీల నిర్వహణను తలపిస్తాయి. పల్నాడు బ్రహ్మనాయుడు యుద్ధకాలంలో కోడి పందేలు నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య శాంతి స్థాపన కోసం మొదటిసారిగా కోడి పందేలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. మహాయుద్ధాలు అనివార్యమైనపుడు ప్రాణ నష్టం జరగకుండా నివారించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఇరు పక్షాల నుంచి కోళ్లను ఎంపిక చేసి వాటి మధ్య పోటీ పెట్టి విజేతలను నిర్ణయించడం పరిపాటి . కోడిపందాల కోసం రెండు నెలల నుంచే ఇక్కడ ప్రిపరేషన్ సాగుతుంది .