పవన్ కళ్యాణ్ సోదాలు చేసి ఆఫ్రికా తరలిపోతున్న రేషన్ బియ్యం పట్టుబడే వరకు అధికారులు కళ్ళు మూసుకుంటున్నార్రా ?
అధికారులు ఇంత బరితెగించి అవినీతికి పాల్పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వ్యం ఏమి చేస్తున్నట్లు . ..
సర్కార్ పెద్దలకూ ఈ అక్రమాలలో వాటాలు అందుతున్నట్లు అనుమానాలు . .
నాలుగు నెలల క్రితం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబీకుల అక్రమాలు దొరికినా బలమైన కేసులు ఇంతవరకు ఎందుకు పెట్టలేదు . . వారితో టీడీపీ నేతలు లాలూచీ పడ్డారా ?
ఇన్ని ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వ్య పెద్దలు సమాధానం చెప్పాలి.
పవన్ కళ్యాణ్ మాత్రం ఏమి చేయగలరు ?
కాకినాడ తీరం రక్షణ పరంగా దేశానికి చాలా కీలకమని కానీ అక్కడసరైన భద్రత లేదని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ నుంచి ఆర్డీఎక్స్‌లతో కసబ్‌లు వచ్చినా ఏమీ చేయలేరన్నారు. బియ్యం స్మగ్లింగ్ విషయంలో కాకినాడ పోర్టులో జరుగుతున్న వ్యవహారాల్ని పరిశీలించడానికి పవన్ వెళ్లారు. అక్కడ ఉన్న భద్రతను చూసి ఆశ్చర్యపోయారు. రోజుకు వెయ్యి లారీలు రాకపోకలు సాగించే పోర్టులో పదహారు మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉన్నారని తెలుసుకుని పవన్ ఆశ్చర్యపోయారు. బియ్యం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన షిప్ వద్దకు వెళ్లాలంటే పోర్టు అధికారులు కూడా సహకిరంచలేదు. అనేక అడ్డంకులు సృష్టించారు.
పరిస్థితి చూస్తూంటే.. పోర్టు పూర్తిగా మాఫియా చేతుల్లో ఉన్నట్లుగా అనిపిస్తోందని పవన్ భావిస్తున్నారు. తాను కాకినాడ పోర్టును పరిశీలించేదుకు వస్తానని చెబుతూంటే రావొద్దని మెసెజులు చేస్తున్నారని.. రెండు నెలల నుంచి రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. రాత్రి కూడా అదే పనిగా మెసెజులు చేశారన్నారు. స్మగ్లింగ్ వ్యవహారం సరిహద్దులు దాటిపోయిందని సీఐడీ పరిధి కన్నా ఎక్కువగా ఉంది సీబీఐనా..మరొకటదానితో విచారణ చేయించాలా అన్నదానిపై కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. తూర్పు తీరం భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
డిప్యూటీ సీఎం అయిన తనకే కాకినాడ పోర్టులో స్టెల్లా అనే ఓడను పరిశీలించేందుకు అధికారులు సహకరించడం లేదని సంచలన విషయాలు చెప్పారు. నాదెండ్ల మనోహర్ దీనిపై పోరాటం చేస్తే విషయం వెలుగులోకి వచ్చినా, చర్యలు తీసుకోవడానికి వీలు కావడం లేదంటే.. ఇది చాలా పెద్ద నెట్‌వర్క్ అన్నారు. గతంలో విశాఖపట్నానికి ఘాజీ అనే పాకిస్తాన్ సబ్ మెరైన్ వచ్చిందని పవన్ గుర్తు చేశారు. గ్యాస్ నిక్షేపాల లాంటి సంస్థలు ఉన్నాయి. ఎస్పీకి మొదటినుంచీ చెబుతున్నా. వారి నుంచి మాకు కనీసం రిపోర్టు రాలేదు.