ఏపీలో రౌడీల, రాక్షస రాజ్యం నడుస్తోందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ … నరకాసురుడి పాలనను మించిపో యిందని.. అన్నారు. ఏపీలో లాండ్, శాండ్, మైన్ మాఫియాలు చెలరేగిపోతున్నాయని మండిపడ్డారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ దుష్టపాలన నుంచి విముక్తి కలిగినప్పుడే.. ఏపీ ప్రజలకు నిజమైన దీపావళి అని తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. జగన్ పాలనపై ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు.