ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. జస్టిస్ డివిఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్ట్ ఫుల్ బెంచ్ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ ఆదేశాలిచ్చింది. అమరావతిలోని ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలంటూ దాఖలైన వ్యాజ్యాలకు సంబంధించి హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో అనుబంధ పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడించేందుకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎ్‌సఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇటీవల తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
రాజధాని అమరావతిలో ఆర్ 5 జోన్‌కి సంబంధించి సీఆర్డీఏ చట్టాన్ని సవరించి తెచ్చిన యాక్ట్ 13/2022, జీవో 45ని సవాల్ చేస్తూ రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ, ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు వ్యాజ్యాలు దాఖలు చేశాయి.
అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వ్యూలు పై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి సమాయత్తం అవుతోంది.