Citroen Basalt: భారత మార్కెట్ లోకి సిట్రోయిన్ బసాల్ట్.. ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం

Citroen Basalt: భారతదేశంలో సిట్రోయిన్ కార్లకు మంచి డిమాండే ఉంది. డిజైన్ తోపాటు కారు లుక్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తాజాగా సిట్రోయిన్ ఇండియా కంపెనీ మరో కొత్త మోడల్ కారును భారతీయ మార్కెట్ లోకి విడుదల చేసింది.

సిట్రోయిన్ ఇండియా బసాల్ట్ ధరలను దేశీయ మార్కెట్ లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.7.99 లక్షలుగా ఉంది. టాటా కర్వ్ తో పోటీపడే కూపే ఎస్‎యూవీని ఆగస్ట్ ప్రారంభంలో సిట్రోయిన్ ఆవిష్కరించింది. బసాల్ట్ కూపే ఎస్‎యూవీ బుకింగ్స్ కేవలం రూ.11,001 టోకెన్ అమౌంట్ తో ప్రారంభం కాగా కస్టమర్లు అక్టోబర్ 31 వరకు ఈ కూపే కార్లను బుక్ చేసుకునే సదుపాయం ఉంది.

సిట్రోయిన్ బసాల్ట్ రెండు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. 82hp, 115Nm మరియు 110hp టర్బో -పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి.. టర్బో పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ( 190Nm) లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ( 205 Nm ) ట్రాన్స్ మిషన్ తో వస్తుంది. అయితే క్లెయిమ్ చేయబడిన ఇంధన సామర్థ్యం పెట్రోల్ కు 18kpl, టర్బో పెట్రోల్ మాన్యువల్ కు 19.5kpl, టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ కు 18.7 kpl ఇస్తుంది.

బసాల్ట్ కూపే ఎస్యూవీ 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో పాటు రియల్ ఏసీ వెంట్స్, ఆరు ఎయిర్ బ్యాగ్స్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే బయట వైపు కొత్త సిట్రోయిన్ బసాల్ట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, సర్క్యూలర్ ఫాగ్ లైట్స్ తో పాటు ఆఫ్షనల్ కాంట్రాస్ట్ కలర్డ్ రూఫ్ లను కలిగి ఉండటం విశేషం.